శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (17:16 IST)

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

Tea
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన పానీయంగా టీ నిలువడం మాత్రమే కాదు , ప్రతి రోజా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా టీ ఉత్పత్తి 5.8 మిలియన్ టన్నులను అధిగమించడంతో, టీ పరిశ్రమ వేగంగా విస్తరించింది. భారతదేశంలో, ఎక్కువ మంది ఇష్టపడే ఒక ప్రియమైన పానీయంగా టీ  మిగిలిపోయింది, ఇక్కడ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2022 సంవత్సరంలోనే, భారతదేశం దాదాపు 1.2 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించింది, ఇది దాని సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యతకు నిదర్శనం. అయినప్పటికీ, టీకి పెరుగుతున్న డిమాండ్ తో టీ లో కల్తీ పెరుగుదలకు కూడా దారితీసింది, టీ తయారీలో ఇక్కడ ఖర్చులను తగ్గించుకోవడానికి మరియు లాభాలను పెంచుకోవడానికి వినియోగించ కూడని పదార్ధాలను టీలో కలుపుతున్నారు. ఈ కథనంలో విడిగా విక్రయించే టీ లో కల్తీ యొక్క సూచికలను అన్వేషిస్తుంది మరియు వినియోగదారులకు అటువంటి ఉత్పత్తులను గుర్తించడానికి మరియు నివారించడానికి ఆచరణాత్మక పద్దతులను అందిస్తుంది. ఆర్థిక ప్రపంచీకరణ పురోగమిస్తున్న కొద్దీ, టీ భద్రత ఆందోళనకర అంశం గా పరిణమిస్తుంది, ప్రత్యేకించి బ్రాండెడ్ రకాలు కంటే విడిగా విక్రయించే టీలో కల్తీ చాలా సర్వ సాధారణంగా మారింది. స్వచ్ఛమైన, కల్తీ లేని టీని నిర్ధారించడం అనేది వినియోగదారుల హక్కు. రిటైలర్లు మరియు వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడం ఇప్పుడు చాలా అవసరం.

టీ కల్తీని అర్థం చేసుకోవడం
ఆకృతిని ఆకర్షణీయంగా మార్చటం, బరువును పెంచడానికి లేదా రుచిని మార్చడానికి టీ ఆకులలో నాసిరకం పదార్థాలను కలపడం ద్వారా టీ కల్తీ జరుగుతుంది. ఈ కలుషితాలు హానిచేయని ఫిల్లర్‌ల నుండి ప్రమాదకరమైన రసాయనాల వరకు ఉంటాయి, చౌకైన ఉత్పత్తులనే అధికంగా వీటిలో వినియోగించటం జరుగుతుంది. ఈ అభ్యాసం తరచుగా సరఫరాదారులు నాణ్యతపై రాజీ పడేలా చేస్తుంది. కల్తీ టీని తీసుకోవడం వల్ల  తేలికపాటి జీర్ణ సమస్యల నుండి తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వరకు ప్రమాదాలు ఎదురవుతాయి.


విడిగా విక్రయించే టీలో సాధారణ కల్తీలను అర్థం చేసుకోవటం...
1. అసహజ కలరింగ్ ఏజెంట్లు: టీ ఆకులను తాజాగా మరియు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, కొంతమంది సరఫరాదారులు సింథటిక్ రంగులను ఉపయోగిస్తారు, ఇవి తరచుగా విషపూరితమైనవి మాత్రమే కాదు  కాలక్రమేణా ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

2. వాడిన టీ ఆకులు: వాడిన టీ ఆకులను తాజా వాటితో కలపడం ఒక సాధారణ పద్ధతి. ఈ మళ్లీ ఎండబెట్టిన ఆకులు పరిమాణాన్ని పెంచుతాయి కానీ టీ నాణ్యత , రుచిని గణనీయంగా తగ్గిస్తాయి.

3. హానికరమైన రసాయనాలు: కొంతమంది టీ ఉత్పత్తిదారులు టీ రూపాన్ని మెరుగుపరచడానికి లెడ్ క్రోమేట్ లేదా కాపర్ సాల్ట్స్ వంటి రసాయనాలను జోడిస్తారు. ఈ పదార్థాలు అత్యంత ప్రమాదకరమైనవి మరియు విషప్రయోగ పరాభవాలతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

4. పూరక పదార్థాలు: తక్కువ-నాణ్యత గల టీ తరచుగా కొమ్మలు, ఇసుక లేదా స్టార్చ్ వంటి పూరక పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవి బరువును పెంచడానికి జోడించబడతాయి, అయితే టీ మొత్తం నాణ్యత మరియు రుచిని తగ్గిస్తాయి.


విడిగా విక్రయించే టీ లో కల్తీని గుర్తించడం
కల్తీని గుర్తించడం సవాలుతో కూడిన అంశమే అయినప్పటికీ, వినియోగదారులు స్వచ్ఛమైన, అధిక-నాణ్యత గల టీని కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి అనేక సూచికలు సహాయపడతాయి:

1. రంగును పరీక్షించండి : కల్తీ లేని టీ ఆకులు సహజమైన, మట్టి రంగును కలిగి ఉండాలి. ఆకులు చాలా ప్రకాశవంతంగా లేదా అసహజంగా ఆకుపచ్చగా కనిపిస్తే, అది నకిలీ రంగును సూచిస్తుంది. కాచినప్పుడు, టీ ఎటువంటి మలినాలు  లేకుండా స్పష్టమైన, ప్రకాశవంతమైన పానీయంను  ఉత్పత్తి చేయాలి.

2. ఇతర పదార్దాల కోసం చూడండి : టీ ఆకులు కొమ్మలు, రాళ్ళు లేదా ఇతర కలుషితాలు వంటి అదనపు పదార్థాల నుండి విముక్తి పొందాలి.

3. ఆకృతిని పరిశీలించండి: ప్రామాణికమైన టీ ఆకులు స్థిరమైన ఆకృతిని, పరిమాణాన్ని కలిగి ఉంటాయి. మీరు అధికంగా ధూళి, విరిగిన ఆకులు లేదా అసమాన టెక్చర్స్ ను  గమనించినట్లయితే, టీ ఫిల్లర్‌లతో కల్తీ కావచ్చు. నాణ్యమైన వదులుగా ఉండే టీ కొద్దిగా ముతకగా మరియు దృఢంగా వుంటుంది , పొడిగా లేదా అతిగా మెత్తగా ఉండకూడదు.

4. నీటి పరీక్షను నిర్వహించండి: ఒక గ్లాసు చల్లటి నీటిలో కొద్ది మొత్తంలో టీ ఉంచండి. నీరు తక్షణమే రంగు మారినట్లయితే, టీలో సింథటిక్ రంగులు ఉండవచ్చు.

5. రుచి మరియు వాసన: మీ ఇంద్రియాలను విశ్వసించండి. అధిక-నాణ్యత కలిగిన  టీ ఒక ప్రత్యేకమైన, తాజా వాసన మరియు సమతుల్య రుచి ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఒకవేళ టీ అసాధారణమైన రీతిలో చేదుగా ఉంటే, వాసన లేకుంటే లేదా అసహజమైన రుచిని కలిగి ఉంటే, అది కల్తీ కావచ్చు. ఒక మంచి టీ గంభీరమైన, పూర్తి ఆహ్లాదకరమైన రుచిని కలిగి ఉంటుంది, అది నోటికి ఆహ్లాదకరంగా ఉంటుంది.

6. తాజాదనాన్ని తనిఖీ చేయండి: కల్తీ లేని టీ ఆకులు వాటి రకానికి తగినట్లుగా ప్రత్యేకమైన సహజమైన, సుగంధ పరిమళాన్ని వెదజల్లాలి. నిల్వ లేదా మురికి వాసన పేలవమైన నాణ్యత లేదా సరికాని నిల్వను సూచిస్తుంది.

7. మలినాల కోసం పరీక్షించండి: బ్రూవింగ్ తర్వాత, మిగిలి ఉన్న అవశేషాలను పరిశీలించండి. టీ ఆకులు రంగు అవశేషాలను వదిలివేస్తే లేదా నీరు మబ్బుగా కనిపించినట్లయితే, ఇది హానికరమైన రసాయనాలు లేదా రంగుల ఉనికిని సూచిస్తుంది.
వృత్తిపరంగా శిక్షణ పొందిన టీ టెస్టర్లు టీలో ఉన్న అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCs) విశ్లేషించడం ద్వారా టీలో కల్తీ జరిగిందో లేదో కనుగొనగలుగుతారు. ఈ సమ్మేళనాలు తరచుగా గ్యాస్ క్రోమాటోగ్రఫీ–ఓల్ఫాక్టోమెట్రీ (కాంగ్ ఎట్ ఆల్ , 2019), గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ (టోర్రెస్ & అల్మిరాల్, 2022) మరియు గ్యాస్ క్రోమాటోగ్రఫీ–అయాన్ మొబిలిటీ స్పెక్ట్రోమెట్రీ (లియు ఎట్ ఆల్, 2021) ద్వారా కనుగొంటారు. ఈ పరిశోధన వైద్య రంగం నుండి ప్రేరణ పొందింది, ఇక్కడ వ్యాధి నిర్ధారణ మరియు ఆరోగ్య పర్యవేక్షణలో ఉపయోగించే బయోమార్కర్ల కోసం ఉచ్ఛ్వాస గాలి విశ్లేషించబడుతుంది.

- డాక్టర్ అడ్డూ కిరణ్మయి, న్యూట్రిషనిస్ట్, టాటా టీ జెమినీ