గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:08 IST)

పారాలింపిక్స్ క్రీడలు : భారత్ ఖాతాలో మరో పతకం .. మొత్తం 25

kapil parmer
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింద. భారత జూడో ఆటగాడు కపిల్ పార్మర్‌ పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది. గురువారం జరిగిన పురుషుల 60 కిలోల జే1 ఈవెంట్లో కాంస్యం గెలిచారు. ప్రపంచ రెండో ర్యాంకర్ జూడోకా ఎలియెల్టన్ డి ఒలివెరాను ఓడించి పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కపిల్ పార్మర్ జూడోలో మెడల్ సాధించిన మొదటి భారత జూడోకాగా చరిత్ర సృష్టించారు.
 
మరోవైపు మిశ్రమ రికర్వ్ ఓపెన్ ఈవెంట్లో ఆర్చర్లు హర్విందర్ సింగ్, పూజ తమ కాంస్య పతక పోరులో పరాజయం పాలయ్యారు. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక పవర్ లిఫ్టర్ అశోక్, షాట్ పుటర్ అరవింద్ ఆకట్టుకోలేకపోయారు. సిమ్రాన్ శర్మ కూడా మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది.
 
ఇక టీమిండియా ఈసారి 25 పతకాల లక్ష్యంగా బరిలోకి దిగగా, గురువారంతో ఆ ఆ లక్ష్యాన్ని చేరుకుంది. మరో మూడు రోజులు ఆటలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పతకాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని. ప్రస్తుతం భారత్ ఖాతాలో 25 మెడల్స్ ఉండగా.. వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది.