పారిస్ ఒలింపిక్స్- నిషాంత్ దేవ్ ఓటమి.. చేజారిన పతకం
భారత బాక్సర్ నిషాంత్ దేవ్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల 71 కిలోల విభాగంలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్ బౌట్‌లో నిషాంత్ 1-4తో మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే చేతిలో పోరాడి ఓడాడు. ఆరంభంలోనే దూకుడుగా పంచ్‌లు విసిరిన నిషాంత్ తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకొన్నాడు. అయితే, రెండో రౌండ్‌లో ఎదురుదాడి చేసిన వెర్డే 3-2తో నెగ్గాడు.
ఇక, మూడో రౌండ్‌నూ మార్కో 5-0తో గెలిచి సెమీ్‌సకు చేరుకొన్నాడు. ఫలితంగా భారత్‌కు ఓ పతకం చేజారింది. బాక్సింగ్‌లో సెమీస్‌లో ఓడినా కనీసం కాస్యం పతకం దక్కుతుంది.
గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు నాకౌట్ సమరానికి సిద్ధమైంది. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో టీమిండియా గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు నాకౌట్ సమరానికి సిద్ధమైంది. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.