గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (09:35 IST)

పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ చరిత్ర.. బ్యాడ్మింటన్ సింగిల్స్‌ సెమీ ఫైనల్‌కు ఎంట్రీ!!

lakshya sen
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. పురుషులు సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. చైనీస్ తైపీ ప్లేయర్ తియర్ చెన్ చౌపై 1-21, 21-15, 21-12 తేడాతో విజయభేరీ మోగించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ఆటగాడికా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఒలింపిక్స్ క్రీడా పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. 
 
రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్ ఓపెనింగ్ సెట్లో 21-19 తేడాతో లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాతి రెండు గేమ్‌లలో అద్భుతంగా పుంజుకున్నాడు. రిటర్న్ సర్వ్‌ను మెరుగుపరుచుకుని చూడచక్కనైన షాట్లోతా ఆలరించాడు. ప్రత్యర్థి ఆటగాడి షాట్లను తెలివిగా అంచనా వేసి రెండో సెట్లో 21- 15తో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.
 
ఇక నిర్ణయాత్మకమైన మూడవ సెట్లో లక్ష్యసేన్ మరింత చెలరేగాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. తియెన్ చెన్ స్కోరు సాధించకుండా నిలువరించి 21-12తో మూడో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుని సెమీ ఫైనల్‌కు చేరాడు.
 
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో లక్ష్యసేన్ మాత్రమే ప్రస్తుతం నిలిచాడు. మిగతా భారత ప్లేయర్లు ఇప్పటికే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన క్వార్టర్-ఫైనల్ రౌండ్లో చేతిలో హెచ్ఎస్ ప్రణయ్ ఓటమిపాలయ్యాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు కూడా రౌండ్-16 దశలోనే నిష్క్రమించింది. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనల్స్‌లో సాత్వికా సాయిరాజ్ రంకి రెడ్డి - చిరాగ్ శెట్టి కూడా అనూహ్య రీతిలో ఓటమిపాలైన విషయం తెల్సిందే.