శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (08:47 IST)

రాజకీయ ఉద్ధండుడు శరద్ యాదవ్ ఇకలేరు

sharad yadav
రాజకీయ ఉద్ధండుడు, జేడీయూ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపుడతూ వచ్చిన ఆయన గురువారం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 75 యేళ్లు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ఈ విషయాన్ని ట్వట్టర్‌లో వెల్లడించారు. "పాపా నవీ రహే (నాన్నగారు ఇకలేరు)" అంటూ పోస్ట్ చేశారు.
 
కాగా, శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జనతాదళ్ (యు)కు ఆయనే తొలి జాతీయ అధ్యక్షుడు. 2016 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అప్పట్లో నితీశ్ కుమార్ ఎన్డీయేత జతకట్టాలని నిర్ణయించుకోవడం శరద్ యాదవ్‌ను తీవ్రంగా కలిచివేసింది. దీన్ని శరద్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయనపై బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. 
 
ఆ తర్వాత 2016లో ఆయన రాజ్యసభ సభ్యత్వంపై కూడా అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆయన సొంతంగా ఎన్.జె.డిని స్థాపించి, దీన్ని ఆర్జేడీలో విలీనం చేసి ప్రస్తుతం ఆర్జేడీ నేతగా కొనసాగుతున్నారు. శరద్ యాదవ్ పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అయినా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.