ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (11:33 IST)

ఐసీయూ వార్డులో వివాహం చేసుకున్న జంట.. ఎందుకో తెలుసా?

marriage
బీహార్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో ఓ జంట ఐసీయూ వార్డులో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని గయా జిల్లాలోని అర్ష్ ఆసుపత్రిలో చాందిని కుమారిగా అనే యువతి గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పూనమ్ కుమారి వర్మ ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. 
 
ఎందుకంటే పూనమ్ ఎపుడైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు. దీంతో పైగా తాను తుదిశ్వాస విడిచేలోపు తన కూతురి పెళ్లి చూడాలని పూనమ్ కుమారి గట్టిగా పట్టుబట్టింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులను ఒప్పించిన వధువు కుటుంబ సభ్యులు పూనమ్ కోరిక మేరకు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోనే వివాహం జరిపించారు. ఈ వివాహం జరిగిన రెండు గంటలకే వధువు తల్లి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.