గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (09:05 IST)

పట్టపగలు యువకుడిని కాల్చి చంపిన దుండగులు .. ఎక్కడ?

gunshot
బీహార్ రాష్ట్రంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కాల్చి చంపి, అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలకు దిగారు. ఈ ఘటన రాష్ట్రంలోని సహస్ర జిల్లాలో జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్ పౌరుడి మృతదేహం లభ్యం కావడం కలకలంరేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమిత్ కుమార్ అనే 18 యేళ్ల యువకుడు గంహరియాలోని 12వ వార్డులో ఉంటూ, బీఏ చదువుతున్నాడు. అతని స్నేహితు గౌరవ్ మార్కెట్‌ వద్దకు రావాలని కోరడంతో అమిత్ అక్కడకు నడుచుకుంటూ బయలుదేరాడు. ఈ క్రమంలో బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు అమిత్‌ను తుపాకీతో కాల్చి పారిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మృతుడి తండ్రి మాత్రం అమిత్ స్నేహితుడు గౌరవ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు.