శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:30 IST)

జార్ఖండ్‌లో దారుణం.. అపార్టుమెంటులో అగ్నిప్రమాదం - 14 మంది మృతి

fire accident
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బహుళ అంతస్తు నివాస గృహంలో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘోరం రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగింది. 
 
ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్నవారిలో నలుగురు చిన్నారులతో పాటు 14 మంది చనిపోయారు. ఈ బహుళ అంతస్తులో ప్రమాదం జరిగిన సమయంలో 400 మంది ఉన్నారు. 
 
మొత్తం 13 అంతస్తులు ఉండే ఈ భవనంలో తొలుత రెండో అంతస్తులో మంటలు చెలరేగి, క్రమంగా భవనం అన్ని అంతస్తులుకు వ్యాపించాయి. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలతో పాటు అగ్నిమాపకదళ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి రక్షించారు. అయినప్పటికీ 14 మంది సజీవదహనమయ్యారు.