సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (09:26 IST)

స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

సికింద్రాబాద్‌ స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లోని డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులు బీహార్‌కు చెందిన జునైద్, వసీం, జాహెద్‌లుగా గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేనంతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ మంటలు చెలరేగాయి. వెంటనే పై అంతస్తులకు వ్యాపించాయి. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భవనంలో అగ్నిమాపక సిబ్బంది 10 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పారు.
 
భవనంలో చిక్కుకున్న 10 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు తొలుత రక్షించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక అధికారులు, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాలను ఖాళీ చేయించారు.