శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (08:28 IST)

రాంగోపాల్ పేటలోని దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభం

deccan mahal
హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేటలో ఉన్న పురాతన దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. గత రాత్రి కూడా ఈ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు ఈ భవనం కూల్చివేత పనులు చేపట్టింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఈ కూల్చివేత పనులను మొదలుపెట్టారు.
 
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్ పేటలో ఈ దక్కన్ మహాల్ ఉంది. ఇటీవల ఈ ప్రమాదంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. పైగా, ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా, గత రాత్రి 11 గంటల నుంచి ఈ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు.
 
ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ రూ.33 లక్షలకు టెండర్లు దక్కించుకుంది. దీంతో భారీ జేసీబీతో గురువారం రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ భవనం ట్రేడర్స్ సిబ్బంది భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.