శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:41 IST)

కారుపై పడిన కంటైనర్‌.. నలుగురు మృతి

రాజస్థాన్‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలీ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై కంటైనర్‌ పడిన దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

గుడా ఆండ్లా పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ పడింది. లోడ్‌ కార్‌పై పడడంతో కారు దెబ్బతింది. 
 
అందులో ప్రయాణిస్తున్న జంటతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి గుండోజ్‌లోని హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్‌, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.