గరికపాటి నరసింహారావు పుట్టినరోజు.. జీవిత విశేషాలు
గరికపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకులు.
నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీ జన్మించారు.
గరికపాటి ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు.
గరికపాటి సతీమణి పేరు శారద. ఇతనికి ఇద్దరు కుమారులు.
వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు.
ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. వాటిలో.. ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి.
భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.