సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (07:11 IST)

భారత సాయుధ బలగాల్లో అమ్మాయిలు

భారత సాయుధ బలగాల్లో చేరడానికి అమ్మాయిలకు అవకాశం వచ్చింది.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ (ఎన్‌ఏ) ల్లో ప్రవేశం, శిక్షణ కోసం అమ్మాయిలను కూడా అనుమతించనున్నట్టు పేర్కొంది.

ఇప్పటివరకు ఇంటర్‌ చదివిన, పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే వీటిలో ప్రవేశానికి అర్హులు. అయితే ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కుష్‌ కల్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అమ్మాయిలను కూడా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు అనుమతించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. గత నెలలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయా పరీక్షలకు అమ్మాయిలను అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై బుధవారం సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరిగింది.

అమ్మాయిలను ఎన్‌డీఏ, ఎన్‌ఏ విభాగాల్లోకి అనుమతించాలని డిఫెన్స్‌ ఫోర్సె్‌సకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు తెలిపింది.