శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (19:04 IST)

18 క్యారెట్ల బంగారంతో ప్రధాని మోదీ ప్రతిరూపం అద్భుతం (video)

Golden Tribute
Golden Tribute
సూరత్‌లోని ఓ ఆభరణాల వ్యాపారి 18 క్యారెట్ల బంగారంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరూపాన్ని అద్భుతంగా రూపొందించారు. సూరత్ నివాసి సందీప్ జైన్ ప్రధానికి అంకితం చేసే దిశగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం బరువు 156 గ్రాములు, 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. 
 
ఈ విగ్రహం నిర్మాణానికి 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా, 20 నుంచి 25 మందితో కూడిన బృందం 3 నెలల పాటు శ్రమించి ఆ భాగాన్ని పూర్తి చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత అతను విగ్రహం కోసం పని చేయడం ప్రారంభించాడు. 
 
ప్రధానిపై ఉన్న ప్రేమతోనే తాను ఈ విగ్రహాన్ని రూపొందించానని, దానిని మోదీ, ఆయన అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు.