సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (06:51 IST)

జై షాను వెనుకేసుకొస్తున్నారంటే తప్పు జరిగినట్టే : యశ్వంత్ సిన్హా

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ అమిత్ షా కంపెనీ ఆస్తులు గత మూడేళ్లలో ఏకంగా 16 వేల రెట్లు పెరిగిన అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ అమిత్ షా కంపెనీ ఆస్తులు గత మూడేళ్లలో ఏకంగా 16 వేల రెట్లు పెరిగిన అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా స్పందించారు. బీజేపీ నేతలు జయ్ షాను వెనుకేసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తప్పుక జరిగినట్టుగానే భావించాలని అభిప్రాయపడ్డారు. 
 
పైగా, జాతీయ అధ్యక్షుడి కుమారుడిపైనే ఈ తరహా ఆరోపణలు రావడం బీజేపీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్టయిందన్నారు. జయ్ షా కేసును వాదించేందుకు ప్రభుత్వ ఉన్నత న్యాయవాది తుషార్ మెహతాను రంగంలోకి దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. జైషాకు విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ రుణం మంజూరు చేసిన విధానం, జైషాను వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్టు కనిపిస్తోందని, ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యశ్వంత్ సిన్హా కోరారు. 
 
కాగా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైషా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ‘ది వైర్’ అనే వెబ్‌సైట్‌లో ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేసిన జై షా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును వాదించడానికి న్యాయశాఖ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రంగంలోకి దిగారు.