మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (12:39 IST)

మైనర్ అని పెళ్లి ఆగిపోయింది.. వధువు తల నరికిన వరుడు

crime scene
పెళ్లి లేటవుతుందని.. ఓ వరుడు వధువును పొట్టనబెట్టుకున్నాడు. నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయి మైనర్ కావడంతో రంగంలోకి దిగిన అధికారులు అడ్డుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన వరుడు ఆమెను నరికి చంపాడు. 
 
కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (16)తో స్థానికుడైన ప్రకాశ్ (32)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. 
 
గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకా మైనర్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. బాల్య వివాహం నేరమని ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
 
నిశ్చితార్థం అడ్డుకోవాలని మీనానే అధికారులకు సమాచారం ఇచ్చిందని అనుమానించిన ప్రకాశ్.. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆపై మీనాను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తల నరికి హత్య చేశాడు. మొండాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.