మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:15 IST)

సినిమా వాళ్ల ఇరుగు పొరుగునే టెర్రరిస్ట్... పట్టుకోలేదు.. చివరికి ఎలా దొరికాడు..?

దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని బాంద్రా అంటేనే సినీ సెలెబ్రిటీలు ఉండే ఏరియా అని అందరికీ తెలుసు. అలాంటి ఏరియాలో 1993 నాటి ముంబై బాంబు దాడుల్లో ఆర్డీఎక్స్‌ను సరఫరా చేసిన కీలక నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉన్న

దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని బాంద్రా అంటేనే సినీ సెలెబ్రిటీలు ఉండే ఏరియా అని అందరికీ తెలుసు. అలాంటి ఏరియాలో 1993 నాటి ముంబై బాంబు దాడుల్లో ఆర్డీఎక్స్‌ను సరఫరా చేసిన కీలక నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉన్నా పోలీసులు కనిపెట్టలేకపోయారు. 23 ఏళ్ల నుంచి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన అబ్దుల్ సత్తార్‌ను ఎట్టకేలకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. 
 
బాంబు దాడుల తరువాత అదృశ్యమైపోయిన అబ్దుల్ సత్తార్, 23 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతను ఎక్కడున్నాడో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. అయితే సత్తార్‌ క్రికెటర్లు, సినీ నటులుండే ముంబైలోని పాపులర్ ఏరియాలో వాద్రా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సత్తార్ వద్ద విచారణ జరిపిన పోలీసులు.. పాకిస్థాన్ ఐఎస్ఐ సాయంతో పేలుడు పదార్థాలను భారత్‌కు తెచ్చాడని, బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత, ముంబైలో అల్లర్లు జరుగుతున్నప్పుడు దుబాయ్‌లో సత్తార్ ఉన్నట్లు చెప్పారు. 
 
కాగా, గోసాబారా ఆయుధాల కేసుతో పాటు ఆర్డీఎక్స్ సరఫరా వెనుక సత్తార్ హస్తముందని చెప్పిన ఏటీఎస్ అధికారులు, ముంబై దాడులకు ముందు దావూద్ ఇబ్రహీంను దుబాయ్‌లో కలిసి చర్చలు జరిపి వచ్చాడని వివరించారు. ఐదు ఏకే-47 రైఫిల్స్, 43 హ్యాండ్ గ్రేనేడ్స్‌ను సొంతం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.