శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (17:24 IST)

భర్త వద్దు... పబ్‌జీనే ముద్దు...

ఓ వివాహిత పబ్‌జీ ఆట కోసం ఏకంగా తన భర్తకు విడాకులు ఇచ్చేందకు సిద్దమైంది. తనకు తన భర్త కంటే పబ్‌జీనే ముఖ్యమని పేర్కొంది. గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత(19) పబ్ జీ గేమ్‌ను బాగా ఆడేది. ఈ క్రమంలో ఆటలో పరిచయమైన మరో యువకుడిని ఆమె ప్రేమించింది. అతడితోనే కలిసి ఉంటాననీ, తనకు విడాకులు ఇప్పటించాలని ఉమెన్స్ హెల్ప్‌లైన్ 'అభయం -181'కు ఫోన్ చేసి కోరింది. 
 
దీంతో అధికారులు ఆమె విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో తమ కోడలు పబ్‌జీ ఆటకు బానిస కావడంతో కొడుకు దాంపత్యంలో విభేదాలు వచ్చాయనీ వాపోయారు. ఈ సమస్యకు మీరే పరిష్కార మార్గం చూపాలంటూ ప్రాధేయపడ్డారు. దీంతో అభయం - 181 వింగ్ అధికారులు తలలు పట్టుకున్నారు.
 
దీనిపై అభయ్ ప్రాజెక్టు చీఫ్ గోహిల్ మాట్లాడుతూ, తమకు రోజుకు ఈ తరహా కాల్స్ 550 వరకూ వస్తుంటాయనీ, అయితే పబ్ జీ కారణంగా విడాకులు కోరిన కేసు మాత్రం ఇదే మొదటిదని తెలిపారు. పబ్ జీ అలవాటును తప్పించేందుకు ఆమెను అహ్మదాబాద్‌లోని పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పగా, అక్కడ ఫోన్లను అనుమతించరని తెలుసుకున్న యువతి, అక్కడకు వెళ్లేందుకు నిరాకరించిందని తెలిపారు.