గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (17:55 IST)

నిప్పుతో హెయిర్ కట్.. చివరకు ఏమైందో చూడండి...

haircut
ఇటీవలికాలంలో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచలో ఏదో ఒక మూల కొత్త ఫ్యాషన్ వెలుగు చూసినా అది వెంటనే నలువైపులా పాకిపోతోంది. సోషల్ మీడియా చలువతో ఈ ధోరణులు మరింత వేగం పుంజుకున్నాయి. ఎక్కడో లాటిన్ అమెరికా దేశాల్లో ఓ సాకర్ స్టార్ సరికొత్త హెయిర్ స్టయిల్చేయించుకుంటే అతడ్ని టీవీలో చూసిన ఆసియన్లు, ఆఫ్రికన్లు అదే హెయిర్ స్టయిల్‌లో అనుసరిస్తున్నారు. 
 
తాజాగా ఫైర్ హెయిర్ కట్ బాగా పాపులర్ అయింది. హెయిర్ స్టయిల్‌ను తీర్చిదిద్దేందుకు జుట్టుకు మంటలు సెగ తగిలేలా చేస్తారు. దీన్నే ఫైర్ హెయిర్ కట్ అంటారు. గుజరాత్‌లో ఓ కుర్రోడు నిప్పుతో హెయిర్ కట్ చేయించుకునేందుకు ప్రయత్నించాడు. క్షురకుడి తలపై కొద్దిభాగంలో ఓ రసాయనం పూసి మంటలు సెగ తగిలేలా చేశాడు. 
 
కానీ, తలపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని నియంత్రించడం కష్టమైంది. ఈ క్రమంలో ఆ కుర్రాడికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడని సూరత్‌లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.