మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (16:44 IST)

గార్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి

గుజరాష్ట్రంలోని తారాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. దుర్గా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గార్బా నృత్యు చేస్తూ ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
తారాపూర్‌లోని ఆనందలో శివశక్తి సొసైటీలో ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ళ వీరభద్ర సింగ్ రమేష్ గార్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీరేంద్ర డ్యాన్స్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది.