బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:20 IST)

కండోమ్ కవర్‌తో తలకు కట్టుకట్టిన సిబ్బంది.. ఎక్కడ?

condom
వైద్యులు ఆపరేషన్ సమయంలో కత్తరను మరిచి అలానే స్టిచ్ చేసే కథనాలు వినేవుంటాం. తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తలకు గాయమై రక్తమోడుతున్న మహిళ ఆసుపత్రికి వస్తే కండోమ్ కవర్‌తో కట్టుకట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాలో జరిగింది. 
 
కట్టుకట్టినప్పటికీ రక్తం అదుపులోకి రాకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడామె కట్టును విప్పిన వైద్యులు కండోమ్ ప్యాక్ చూసి షాకయ్యారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. ధరమ్‌గఢ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలి తలకు ప్రమాదవశాత్తు గాయమైంది. పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె గాయానికి కట్టుకట్టారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
 
పరిశీలించిన అక్కడి వైద్యులు కుట్లు వేసేందుకు కట్టు విప్పారు. గాయంపై కనిపించిన కండోమ్ ప్యాక్ చూసి షాక్ అయ్యారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రెస్సర్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.