సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:55 IST)

వందే భారత్ రైళ్లలో మరిన్ని సౌకర్యాలు...

vande bharat
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లలో మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ రైళ్లలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే శాఖ చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా, ఆదివారం నుంచి మరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటిలో మరిన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఇందుకోసం ఏకంగా 25 మార్పులు చేసినట్టు రైల్వేశాఖ పేర్కొంది. 
 
సీట్లలో మరింత వెనక్కు వాలి నిద్రపోయేందుకు వీలుగా పుష్ బ్యాక్, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ చార్జింగ్ పాయింట్, ఫుడ్ ట్రేలను మార్పులు చేశారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్ బేసిన్ల లోతును కూడా పెంచారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. 8 గంటల పాటు కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారన్న తలంపుతో రైల్వే ఈ చర్యలు తీసుకుంది.
 
మరోవైపు, గురువారం కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రైలు ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన రైలు రాత్రి తిరిగొచ్చింది. అలాగే, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళుతుంటే విజయవాడ - చెన్నై వందేభారత్ మాత్రం గూడురు నుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.