శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (11:33 IST)

డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమార్తె ఇంట్లో ఐటీ సోదాలు..

తమిళనాడులో ఎన్నికల హడావుడి.. ప్రచారంలో రాజకీయ నేతలు బిజీ బిజీగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమార్తె ఇంట్లో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. 
 
కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు  జరగడం ఇది రెండవసారి. గ‌త నెల‌లో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. 
 
తాజాగా స్టాలిన్ అల్లుడి శ‌బ‌రీశన్‌కు చెందిన నాలుగు ప్ర‌దేశాల్లో శుక్రవారం ఉద‌యం నుంచి సోదాలు జ‌రుగుతున్నాయి. నీలంగ‌రైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. స్టాలిన్ కూతురు సెంత‌మారై త‌న భ‌ర్త శ‌బ‌రీశన్‌తో పాటు అక్క‌డే నివ‌సిస్తున్నారు.