1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మే 2024 (11:31 IST)

రైతులకు గుడ్ న్యూస్.. మే19 నాటికి దేశంలోకి నైరుతి రుతుపవనాలు

monsoon
monsoon
మండే ఎండల నుంచి ఉపశమనం కలుగనుంది. మే నెలల్లో ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది శుభవార్త. అలాగే దేశ రైతులకు ఇది గుడ్ న్యూస్. భారత రైతాంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది. 
 
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లోనే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా వారం, పది రోజుల్లో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయి. 
 
కానీ, ఈసారి మూడు రోజులు ముందే.. మే 19 నాటికి చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
అయితే రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకాలంటే అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలించాలని.. అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే నైరుతి రాకను జాప్యం తప్పదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.