బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:04 IST)

మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు

సబ్సిడీయేతర సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 19 పెంచుతూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు నేటినుంచి అంటే జనవరి1, 2020 నుంచి అమలులోకి వస్తాయి.

గత అయిదు నెలలుగా సబ్సిడీయేతర సిలిండర్ ధరలు ప్రతినెల పెరుగుతూనే వస్తున్నాయి. గత ఆగష్టు నుంచి ఇప్పటివరకు సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 140 పెరిగింది.
 
ఢిల్లీ మరియు ముంబైలలో, సబ్సిడీయేతర సిలిండర్‌కు వరుసగా రూ .19 మరియు రూ .19.5 చొప్పున పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి సబ్సిడీయేతర సిలిండర్‌కు ఢిల్లీలో రూ .714, ముంబైలో రూ .684.50గా మారిందని ఐఓసీ తెలిపింది.

ఈ ధరలు డిసెంబరులో వరుసగా రూ. 695 రూపాయలు మరియు రూ. 665 రూపాయలుగా ఉన్నట్లు ఐఓసీ తెలిపింది. కోల్‌కతాలో రూ. 21.5 పెంచి సిలిండర్ ధర రూ. 747గా సవరించారు. చెన్నైలో రూ .74 పెంచి సిలిండర్ ధర రూ .734 సవరించారు.
 
డిసెంబర్ 1, 2019 నుంచి 19 కిలోల సిలిండర్ల ధరలను ఢిల్లీలో యూనిట్‌కు రూ .1,241కు, ముంబైలో రూ .1,190 కు సవరించారని ఇండియన్ ఆయిల్ తెలిపింది. ప్రస్తుతం 14 కేజీల సిలిండర్లు సంవత్సరానికి 12 సిలిండర్ల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతినెలా మారుతూ ఉంటుంది.