శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (10:41 IST)

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి మెగా ర్యాలీ

congress flag
ఢిల్లీలోని రామ్ లాలీ మైదాన్ వేదికగా ఇండియా కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ మెగా ర్యాలీ ద్వారా సత్తా చాటేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఈ మెగా ర్యాలీని చేపడుతున్నరు. ఆమె ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా దాదాపు 28 మంది పార్టీల నేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. విపక్షాలు ఈ మెగా ర్యాలీలో ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల జప్తు వంటి అనేక అంశాలను ప్రస్తావించనున్నారు.
 
ఈ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, భగవంత్ మాన్, చంపాయ్ సోరెన్, మమతా బెనర్జీ ప్రతినిధులు పాల్గొంటారని ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. డీఎంకే ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, వామపక్షాల ప్రముఖ నేతలు కూడా హాజరుకానున్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ భార్య సునీతా కేజ్రివాల్ కూడా రాంలీలా మైదాన్‌లో జరుగనున్న ఇండియా అలయన్స్ ర్యాలీలో పాల్గొనున్నారు. కేజీవాల్ అరెస్టు తర్వాత సునీత బహిరంగంగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.