శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (18:20 IST)

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే : మహిళకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

మార్చి 8వ తేదీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఓ శుభవార్త చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీచేశారు. 
 
ఇదిలావుంటే, ఈ ఉమెన్స్‌ డేను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మహిళా బంధు పేరిట సోమవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. 
 
తెలంగాణ భవన్‌లో అంగన్ వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీ దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు పాల్గొన్నారు.