ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (10:53 IST)

ఇటా తుఫాను-65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు

ఇటా తుపాను కరీబియన్‌లోని పలు ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. 
 
ఈ తుపాను మంగళవారం ఉదయానికి నికరాగ్వా, హోండూరస్‌ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. నికరాగ్వా, హోండూరస్, జమైకా, కేమన్‌ ఐలాండ్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.