ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (21:17 IST)

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్కర్‌

jagdeep dhankar
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున ఎవరిని బరిలోకి దింపుతారన్న నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న జగదీప్‌ ధన్కర్‌ పేరును ఎన్డీయే ప్రకటించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో శనివారం నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అభ్యర్థి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆయన పేరును ప్రకటించినట్టు తెలిపారు. 
 
కాగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేర్లలో జగదీప్ ధన్‌కర్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. కానీ, బీజేపీ మాత్రం ఆయన పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై పేరు సైతం తెరపైకి వచ్చింది. కానీ, వీరెవరినీ కాదని బీజేపీ అధిష్టానం ధన్‌కర్ పేరును ప్రకటించడం గమనార్హం.