శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (12:38 IST)

ఉద్ధవ్ రాజీనామాకు ఆమోదం - రేపు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం

udhav - fadnavis
మహారాష్ట్రంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఇపుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వాన్ని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏర్పాటు చేయనున్నారు. ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
శివసేన పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలంతా కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 12 మందికి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో చోటు లభించనుంది. ఇదిలావుంటే, ఉద్ధవ్ రాజీనామాను గవర్నర్ కోశ్యారీ ఆమోదించారు.