శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (18:01 IST)

జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్టు

PoesGarden
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని మెమోరియల్‌గా మార్చేందుకు వీలులేదని తమిళనాడు మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  జయలలితకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. 
 
వేద నిలయంపై కూడా వివాదం జరిగింది. ఈ నిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు తమిళ సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వేద నిలయంపై తమిళనాడు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది. ఈ మేరకు ఏడీఎంకే ఇచ్చిన జీవోను కూడా కోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి హక్కులేదని తెలిపింది కోర్టు. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలుకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.