స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వని జెట్ ఎయిర్వేస్ సంస్థ.. ఎందుకో తెలుసా?
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు విమానం క్యాబిన్ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదట. మంచి శరీరాకృతి లేనందున ఈ ఉద్యోగానికి సరిపోదని
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు విమానం క్యాబిన్ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదట. మంచి శరీరాకృతి లేనందున ఈ ఉద్యోగానికి సరిపోదని ఉద్యోగం ఇవ్వలేమని తిరస్కరించారట. ఈ విషయాన్ని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) ఢిల్లీలో ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి గతంలో తనకు ఎదురైన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. నేను కావాలనుకున్న ఉద్యోగాల్లో ఎయిర్వేస్లో ఉద్యోగం చేయడం ఒకటి. కానీ క్యాబిన్ క్రూ ఉద్యోగానికి వెళితే నన్ను తిరస్కరించారు. కానీ ఆ ఉద్యోగాన్ని తప్పించినందుకు ఇప్పుడు నేడు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ తర్వాతికాలంలో నేను మెక్ డొనాల్డ్స్లో పనిచేశా. ఆ తర్వాత మిగిలిన నా జీవితమంతా మీకు తెలిసిందేనని అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగం వచ్చివుంటే తాను కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. టీవీ నటిగా పేరు సంపాదించిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయిన సంగతి తెలిసిందే.