ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (07:56 IST)

'వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్

‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మారనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా మార్చాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

దీనిపై కేంద్ర కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా  మార్చాలని కోరుతూ ప్రతిపాదన వచ్చిందని, దీనిపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు.

దేశంలోని ఏ ప్రాంతం పేరు మార్చాలన్నా అందుకు కేంద్ర హోంశాఖ అనుమతి పొందాల్సివుంటుంది. యూపీ సర్కారు ఫిరోజాబాద్ జిల్లా పేరును కూడా త్వరలో చంద్రనగర్ అని మార్చనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.