దేశంలో అతి తక్కువ జీతం తీసుకోనున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు, నెలకి రూ. 30,000
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ కేంద్రం ప్రతిపాదించిన విధంగా ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపును ఆమోదించింది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు దేశంలోనే అత్యల్పం అంటే... మొన్నటివరకూ రూ. 12,000 చెల్లించారు. కొత్తగా ఆమోదించిన ప్రకారం ఇకపై రూ. 30,000 చెల్లిస్తారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను తాజాగా ఆమోదించింది. ఆ ప్రకారం ఇకపై ఎమ్మెల్యేలకి 30 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకుని రూ. 90 వేల వరకూ వస్తుంది.
కాగా 2011 నుండి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం పెరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూనే వున్నది. ఇతర రాష్ట్రాల MLA లతో సమానంగా ఉండాలని కోరింది.
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాభత్యాలు చివరిగా 2011లో పెంచబడ్డాయి. ఢిల్లీలో జీవన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ గత 10 సంవత్సరాలలో ఎటువంటి పెరుగుదల లేదు.
ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరింది. ఎట్టకేలకు రూ. 90 వేలకు ఆమోదం తెలపడంతో కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదించింది.