జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం చోటుచేసుకుంది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ (46) అనుమానాస్పదంగా చెందాడు. ఆయన మృతదేహ అనుమానాస్పదస్థితిలో పడివుండటంతోపాటు ఆయన తలకు బుల్లెట్ గాయం, చేతిలో పిస్టల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను ఎవరైనా హత్య చేశారా లేక తుపాకీతో కాల్చుకుని చనిపోయాడా అనే సందేహం కలుగుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వినయ్ సింగ్ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, వెంటనే ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా జెంషెడ్‌పూర్‌లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లేసరికి ఆయన మృతదేహం కనిపించింది.
ఆయన తలకు బుల్లెట్ గాయమవగా, ఎడమ చేతిలో పిస్టల్ ఉంది. వినయ్ సింగ్ మరికొందరితో కలిసి ఇంటికి తిరిగివస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ఆయనను నిజంగానే ఎవరైనా కాల్చి చంపారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పదమృతి వెనుకు ఉన్న మిస్టరీ వీడిపోయింది. ఆయన భార్యే హంతకురాలని తేలిపోయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పైగా, ఈ హత్య కేసులో మాజీ డీజీపీ కుమార్తె హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపులోనూ తన భర్త ప్రకాశ్.. తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్‌లు పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ఆదివారం మరోమారు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్రరూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి 'ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్' అంటూ ఫోనులో మెసేజ్ పెట్టింది. డీజీపీ అలోక్ మోహన్, బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.