గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (13:35 IST)

లైసెన్స్‌ రివాల్వల్ తీసుకెళుతుండగా హీరో గోవిందాకు ప్రమాదం... నిలకడగా ఆరోగ్యం

govinda
బాలీవుడ్ నటుడు గోవిందకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్ మిస్‌ఫైర్ కావడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 
 
మంగళవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేయి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనల్లుడు విజయానంద్ తెలిపారు.
 
"నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను. కాలులో బుల్లెట్ తొలగించారు" అని గోవిందా ఓ ఆడియోను విడుదల చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే నటుడు గోవిందాతో ఫోనులో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను ఆదేశించారు.