ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (09:44 IST)

బాలీవుడ్ నటుడు గోవిందా తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తరలింపు

govinda
బాలీవుడ్ నటుడు, శివసేన నాయకుడు గోవింద మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తూ తన తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఫలితంగా నటుడు గోవిందాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నటుడి తుపాకీ మిస్ ఫైర్ అయిందని చెబుతున్నారు.
 
మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటలకు నటుడు ఇంటి నుండి బయలుదేరే ముందు తన తుపాకీని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నటుడు తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు తెలిపారు. గోవింద ఎందుకు తనిఖీలు చేసి తుపాకీని తీసుకెళ్లాడనేది ఇంకా తెలియరాలేదు. నటుడి కుటుంబం, వైద్య బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ నటుడు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.