శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (11:06 IST)

ఢిల్లీ మద్యం కేసు విచారణ జరుపుతున్న జడ్జి బదిలీ!!

court
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కామ్ కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ బదిలీ అయ్యారు. ఆయనతో సహా మరో 26 మందిని న్యాయమూర్తులను ఢిల్లీ హైకోర్టు పరిధిలో బదిలీ చేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు నాగ్‌పార్ స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. అలాగే, నాగ్‌పాల్‌ను ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు (వాణిజ్య న్యాయస్థానం)కు జడ్జీగా బదిలీ చేశారు. 
 
జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితర ప్రముఖులు అరెస్టు అయ్యారు. సిసోడియా, సంజయ్ సింగ్ జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండగా, కవిత ఈడీ రిమాండ్‌లోనే ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీ పోస్టింగ్ జాబితా ప్రకారం... ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో న్యాయమూర్తి నాగ్‌పాల్‌ల్ ఒకరు. మరోవైపు, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
 
జగన్‌కు మరో ఎదురుదెబ్బ... కాంగ్రెస్ పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ టాటా చెప్పేశారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైకాపాను ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వీడిపోయారు. ఆ జాబితాలో తాజాగా ఆర్థర్ కూడా చేరిపోయారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్‌కు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు టిక్కెట్‌ను ఆర్థర్‌కు కాకుండా మరో వైకాపా నేత దారా సుధీర్‌కు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌కు తీవ్ర మనస్తాపం కలిగించింది. అంతేకాకుండా, ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ పాలక వర్గం ఎన్నికల్లో కూడా వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బైరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికే చైర్మన్ పదవి దక్కింది. 
 
ఈ నేపథ్యంలో బైరెడ్డి వర్గానికి చెందిన వారికి మార్కెట్ పాలకవర్గ పదవులు దక్కించుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ జీర్ణించుకోలేకపోయారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఆర్థర్ ప్రతిపాదించగా, అక్కడ కూడా ఆయనకు నిరశే ఎదురైంది. పైగా, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కూడా ఎమ్మెల్యే ఆర్థర్‌కు విభేదాలు ఉన్నట్టు సమాచారం.