సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (22:25 IST)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

arvind kejriwal
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. లోక్‌స‌భ ఎన్నికల హడావుడి ప్రారంభం అయిన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేజ్రీవాల్​కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు తనకు నోటీసులు జారీచేసిన తొలిసారే కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని ఐదు పేజీల సమాధానాన్ని సీఎం ఈడీకి పంపించారు.