ఢిల్లీ ముఖ్యమంత్రి నోటో జవాన్ డైలాగుల ప్రస్తావన
ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన "జవాన్" చిత్రం విడుదలైంది. ఇందులో డైలాగులు బాగా పాపులర అయ్యాయి. ఈ డైలాగులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేస్తున్నారు. జవాన్ సినిమాలోని డైలాగ్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. రాజకీయ పార్టీలకు వారు అందించే విద్య, వైద్య సౌకర్యాల ఆధారంగా ఓటు వేయాలి.
మతం, కులం పేరిట ఓటు వేయడం సరికాదు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారా? తమ కుటుంబానికి మెరుగైన వైద్యం అందిస్తారా? అని అడిగి ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని సినిమాలో షారుక్ చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేశారు. మరోవైపు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోందని, ఇన్నేళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరోవైపు, 'జవాన్' సినిమాలోని డైలాగ్ ఇప్పటికే రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన ఫొటోతో పాటు జవాన్ పోస్టర్‌ను పంచుకుంటూ బుధవారం భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అవినీతి పాలనను 'జవాన్' సినిమాలో చూపించారని భాటియా రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలనను బహిర్గతం చేసినందుకు షారుక్‌కు ధన్యవాదాలు చెప్పాలని ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.