ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (17:25 IST)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు: 136 స్థానాల్లో జెండా ఎగరేసిన హస్తం

congressflags
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 136 చోట్ల విజయం సాధించింది. ఈ నెల 10న కర్ణాటకలో పోలింగ్ జరిగింది. శనివారం ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. 
 
ఈ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ 113 కాగా.. 23 స్థానాలు ఎక్కువే గెలిచిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా కర్ణాటక ఫలితాలలో హస్తం గెలవడంపై పండగ చేసుకుంటున్నారు. ఇక అధికార బీజేపీ 64 సీట్లకే పరిమితం అయింది. జనతాదళ్ (ఎస్) 20 స్థానాల్లో నెగ్గగా, ఇతరులు 4 స్థానాలు సొంతం చేసుకున్నారు.