సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 మే 2023 (09:34 IST)

karnataka election results: దూసుకుపోతున్న కాంగ్రెస్-131 చోట్ల ఆధిక్యం, చతికిలబడ్డ భాజపా

karnataka election results
కర్నాటకలో హస్తం హవా సాగుతున్నట్లు కనబడుతోంది. అధికార భాజపాకు భంగపాటు తప్పనట్లు ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టి అర్థమవుతుంది. కర్నాటకలో మొత్తం 224 చోట్ల ఎన్నికలు జరుగగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వెళుతోంది.
 
కాంగ్రెస్ పార్టీ 131 చోట్ల ఆధిక్యంలో వుంది. భాజపా 73 చోట్ల, జేడీఎస్ 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 చోట్ల ముందంజలో వున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి.