సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (13:40 IST)

పంజాబీ మంచం.. అమెరికాలో రూ.లక్ష పలుకుతోంది..

indian bed
indian bed
మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో కొన్నింటికి వున్నట్టుండి డిమాండ్ పెరుగుతుంది. అలాంటి వస్తువుల్లో ప్రస్తుతం భారత సంప్రదాయ మంచాలు..అంటే చేతితో నేసిన జనపనార మంచాలు అమెరికాలో భారీ రేటు పలుకుతున్నాయి.

ఒక్క మంచం ధర రూ.లక్ష కంటే ఎక్కువ అని ఆ దేశ ఈ-కామర్స్ సైట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ట్రెడిషనల్ ఇండియన్ బెడ్ అనే బెడ్ చిత్రాల ధర రూ. 1,12,75లకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
పాతకాలపు వస్తువులు, క్రాఫ్ట్ సామాగ్రిని అమ్మడంలో ప్రత్యేకత కలిగిన అమెరికన్ ఇ-కామర్స్ కంపెనీ, ఈ పంజాబీ మాంజీని "సున్నితమైన అలంకార ఆకర్షణతో కూడిన సాంప్రదాయ భారతీయ మంచం"గా జాబితా చేసింది.

ఈ మంచం వెడల్పు 36 అంగుళాలు, ఎత్తు 72 అంగుళాలు, లోతు 18 అంగుళాలు అని సదరు ఇ-కామర్స్ సంస్థ వెల్లడించింది. దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.