మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:46 IST)

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా వుండాలి.. బీజేపీది మాది అదే స్టాండ్: పవన్

pawan klyan
వైకాపా నుంచి ఏపీకి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై కసరత్తు చేశామని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో జేపీ నడ్డాతో సమావేశం అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో గత రెండు రోజుల పాటు పలువురు నేతలను కలిశామన్నారు. 
 
ఏపీలో వైకాపాకు చెక్ పెట్టే దిశగా.. వైకాపా చెర నుంచి ఏపీని రక్షించే దిశగా అన్ని కోణాల నుంచి చర్చలు జరిపినట్లు పవన్ వెల్లడించారు. ఏపీలో మొదటి నుంచే తాము స్థిరత్వాన్ని కోరుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలన్నదే జనసేన అజెండా అని, బీజేపీ అజెండా కూడా అదేనని వివరించారు. 
 
ఈ చర్చలు ఇచ్చే సత్ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం కూడా కీలకమేనని వివరించారు. ధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.