శుక్రవారం, 9 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 27 మార్చి 2023 (09:43 IST)

'దేవుని పనిపూర్తయింది' .. సముద్రఖని ట్వీట్

pawan- samudrakhani
పవర్ స్టార్ పవన కళ్యాణ్ - నటుడు, దర్శకుడు సముద్రఖని కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ టాకీ పార్టీ షూటింగు పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "దేవుడికి థ్యాంక్స్... కళ్యాణ్ సర్‌పై టాకీ పార్టును విజయవంతంగా పూర్తి చేశాం" అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు సెట్స్‌పై పవన్‌తో కలిసున్న వర్కింగ్ స్టిల్‌ను ఆయన షేర్ చేశారు. 
 
కాగా, తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన 'వినోదయ సిత్తం' చిత్రానికి ఇది రీమేక్. తెలుగు వెర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడుగా నటిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌లు హీరోయిన్లు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రంలో తనికెళ్ల భరణి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. జూలై 28వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేశారు.