బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:18 IST)

పాకిస్థాన్‌లో జీవించడం.. జైల్లో ఉండటం రెండూ ఒక్కటే : సైమన్ డౌల్

simon doull
పాకిస్థాన్ దేశంలో జీవించడం కంటే జైల్లో ఉండటం నయమని న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. 
 
క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుతో పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ అజమ్ నాయకత్వం వహిస్తున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజమ్ 65 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అయితే, 83 పరుగుల నుంచి 100 పరుగులు చేరుకోవడానికి 14 బంతులు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గెలుపొందింది. దీంతో బాబర్‌పై సైమన్ డౌల్ విమర్శలు గుప్పించారు. దీంతో డౌల్‌‌కు బాబర్‌తో పాటు పాకిస్థాన్ క్రికెట్ జట్టు అభిమానుల నుంచి బెదిరింపులు వచ్చాయి. 
 
ఆయన బస్ చేసిన హోటల్‌ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండేవారు. దీంతో తాను భయంతో కనీసం తినేందుకు కూడా బయటకు వెళ్లేవాడిని కాదని డౌల్ చెప్పాడు. కొన్ని రోజులు తిండి లేకుండా బాధపడ్డానని తెలిపాడు. ఎంతో మానసిక హింసకు గురయ్యాయని చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో జీవించడం కంటే జైల్లో ఉండటమే బెటర్ అని చెప్పారు. గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.