గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (18:08 IST)

అదనపు కట్నం తేలేదని లిఫ్టులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ భర్త కట్టుకున్న భర్తకు లిఫ్టులో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తాను అడిగిన అదనపు కట్నం తేలేదన్న కోపంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తికి ఓ మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. 
 
వివాహ సమయంలో ఆయనకు రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్లు అదనపు కట్నం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. 
 
పుట్టింటికి వెళ్లిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. బాధితురాలు డబ్బులు తీసుకురాకపోవడం వల్ల లిఫ్ట్​లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.