1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (19:45 IST)

బీఎండబ్ల్యూ కారు, బంగారం కావాలన్న ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు .. ఎక్కడ?

shahana doctor
వాళ్లిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతులు. పైగా, డాక్టర్లు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, పెళ్ళికి మాత్రం ఎలాంటి లాంఛనాలు ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు చెప్పారు. కానీ, యువకుడు మాత్రం బీఎండబ్ల్యూ కారుతో పాటు 15 ఎకరాల స్థలం, బంగారం కావాలంటూ డిమాండ్ చేశారు. అవి ఇచ్చే స్థోమత లేదని వధువు తల్లిదండ్రులు చెప్పడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
మృతురాలి పేరు డాక్టర్ షహానా. తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో పీజీ చేస్తుంది. ఈఏ రువాయిస్ అనే మరో వైద్యుడిని ప్రేమించింది. వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, అబ్బాయి తరపువారు మాత్రం ఈ పెళ్లి జరగాలంటే బీఎండబ్ల్యూకారుతో పాటు 15 ఎకరాల స్థలం, భారీగా బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అలాంటి లాంఛనాలు ఇవ్వలేమని షహానా కుటుంబం స్పష్టం చేసింది. దీంతో ఈ పెళ్లిని వరుడు కుటుంబ సభ్యులు రద్దు చేశారు. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్ షహానా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అపార్టుమెంట్‌లో సూసైడ్ నోట్ లభ్యం కాగా, ప్రతి ఒక్కరికీ డబ్బే ప్రదానం అంటూ రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఈ కేసును దర్యాప్తు చేసే యువ వైద్యురాలి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించారు.