సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (15:18 IST)

అక్కకు నైట్ డ్యూటీ.. మరదలిని పిలిపించిన బావ.. చివరికి శవమై..?

తన బావ పిలవడంతో అతని ఇంటికి వెళ్లిన ఓ యువతి తెల్లారేసరికి శవమై కనిపించింది. ఈ ఘటన కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ(25) ప్రస్తుతం వందనమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తాత్కాలిక నర్సుగా పనిచేస్తోంది. ఆమె అక్క కూడా ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. 
 
అయితే శుక్రవారం హరికృష్ణ అక్కకు నైటీ డ్యూటీ ఉండడంతో వెళ్లింది. దాంతో ఆమె భర్త రతీష్.. హరికృష్ణ ఇంటికి వచ్చాడు. తమ పిల్లలను చూసుకోవడానికి తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా హరికృష్ణను కోరాడు. ఈ క్రమంలోనే హరికృష్ణ అతనితో కలిసి ఇంటికి వెళ్లింది. 
 
అయితే ఉదయం హరికృష్ణ కనిపించడం లేదనే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా రతీష్ ఇంట్లో ఆమె మృతదేహం లభించింది. మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హరికృష్ణ అక్క, ఆమె భర్త పరారీలో ఉన్నారు. వారి ఫోన్‌లు కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.