కేరళలో తగ్గని కరోనా.. పెరుగుతున్న జికా వైరస్.. లాక్‌డౌన్ దిశగా...?
దేశవ్యాప్తంగా కరనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా జూలై నెలలో మళ్లీ పూర్తి లాక్ డౌన్ పడనుంది. ఒకవైపు కేరళలో జికా వైరస్ వణికిస్తుండగా.. మరోవైపు రోజువారీ కొత్త కరోనా కేసులు వేలసంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల కంటే.. ఒక కేరళలోని 30 శాతం నమోదవుతున్నాయి. అలాగే పాజిటివిటీ రేటు కూడా అదే స్థాయిలో ఉంది.
అత్యవసర పరిస్థితి దృష్ట్యా కేరళ ప్రభుత్వం మళ్లీ పూర్తి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. అది కూడా జూలై 17, జూలై 18 తేదీల్లో వారంతపు లాక్‌డౌన్ విధించింది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను మళ్లీ విధించింది. ఈ కొత్త కరోనా ఆంక్షలు గురువారం (జూలై 15) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.